దేవరకొండ బర్త్ డే ట్రక్స్ : ఐస్ క్రీమ్స్ free గా తినేయండి

TheDeverakondaBirthdayTruck
Movie News

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ cool news చెప్పారు. ఎండాకాలంలో చల్లచల్లని కబురుతో మీ ముందుకు వస్తున్నారు. city లో ఉచితం ఐస్ క్రీమ్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాడు. అందుకు 3 వెహికల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఉచితంగా అందించే ఐస్ క్రీం ఎవరెవరికి ఇవ్వనున్నట్లు తెలిపాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా traffic కానిస్టేబుళ్లు, వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి, students , చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపాడు. తన బర్త్ డే అయిన మే 9వ తేదీన ఇవి రోడ్డెక్కుతాయని తెలిపాడు. దేవరకొండ birthday ట్రక్ కనిపిస్తే.. ఏ మాత్రం సిగ్గుపడకుండా బండి ఆపి.. ఐస్ క్రీమ్స్ తినండి అని కూడా చెబుతున్నాడు.

thedeverakondabirthdaytruck
thedeverakondabirthdaytruck

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో కూడా చెప్పాడు. మండే ఎండల్లో 3 రోజులు షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందని.. అలాంటిది ఉదయం అంతా ఎండలోనే traffic కానిస్టేబుళ్లు duty ఎలా చేస్తున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ప్రతి traffic జంక్షన్ దగ్గర విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా ఐస్ క్రీం అందించనున్నట్లు తెలిపాడు. అదే విధంగా రోడ్డు పక్కన వ్యాపారులతో జీవనం సాగించే వారికీ కూడా అందించనున్నట్లు వెల్లడించాడు. ఎండాకాలం మొత్తం ఈ మూడు ట్రక్కులు.. city మొత్తం తిరుగుతూ ఉచితంగా ఐస్ క్రీం అందిస్తాయని తెలిపాడు.

=>సెకండ్ హ్యాండ్ బైక్ కోసం వెతికే వారికీ మంచి అవకాశం.హైదరాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న బైక్ లను 10th may 2018 కి వేలం వేస్తున్నారు.
No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rx100-theatrical-trailer-watch-now
Movie News
RX 100 ట్రయిలర్ : అర్జున్ రెడ్డి ని తలదన్నేలా లిప్ లాక్ లు , రొమాన్స్ (వీడియో)

Telugu సినిమాల్లో lip lock లు అంటే చాలా మాములుగా అయిపోయాయి ఇప్పుడు. అదీ ఏమాయ చేసావే , అర్జున్ రెడ్డి ల తర్వాత అయితే మరీ సాధారణంగా మారిపోయాయి. కానీ ఈ trailer లో మాత్రం శృంగారాన్ని మరింత ఘాడంగా , కొంచెం పచ్చిగా చూపించే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఇంకెందుకు ఆలశ్యం క్రింద video ఉంది చూసెయ్యండి.

director-confirmed-for-ntr-biopic-balakrishna
Movie News
ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్!

శ్రీ నందమూరి తారక రామారావు biopic ను ఆయన తనయుడు బాలకృష్ణ అట్టహాసంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ముహుర్తపు shot opening జరిగింది. ఈ సినిమా దర్శకుడు తేజ project నుండి బయటకు రావడంతో ప్రస్తుతం NTR బయోపిక్ పై ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. తేజని మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో కొత్త దర్శకుడి వేటలో పడ్డాడు బాలకృష్ణ. …