నీతి : రాజు గారి కుక్క చచ్చిపోతే ..అందరూ వస్తారు…రాజు గారే పోతే..ఎవరూ రారు

savitri death mahanati
Movie News

“మహానటి” cinema చూసిన మా అమ్మ నన్నొక ప్రశ్న అడిగింది….సావిత్రి లాంటి మహానటి అన్ని కష్టాల్లో ఉంటే మరి cinema వాళ్లంతా ఏం చేస్తున్నట్టు ??? ఆమెనే కాదు….చాలా మంది మనసులో నానుతున్న ప్రశ్న ఇది….. అనుభవంలో నేను చాలా చిన్నవాడిని…కానీ industry గురించి నాకు అర్థమైన భాషలో చెప్తాను….

సావిత్రి (గారు) చనిపోయేనాటికి ఆమె మహానటి కాదు……Fade Out అయిపోయిన ఒక నటి….ఆమె నటించే cinema లకి కానీ….ఆమెకి కానీ ఎటువంటి demand లేదు…. ఆవిడతో ఎవరికీ అవసరం కూడా లేదు….

ఈ రోజు మనకి జంధ్యాల అంటే ఎవరు….ఆహా నా పెళ్ళంట, శ్రీ వారికి ప్రేమలేఖ, చంటబ్బాయ్ లాంటి ఎన్నో గొప్ప cinema లు అందించిన ఒక మహా మనిషి…….కానీ ఆయన చనిపోయేనాటికి ష్ గప్చుప్…ఓహో నా పెళ్ళంట, విచిత్రం, బాబాయ్ హోటల్ లాంటి 12-15 వరస flop లతో ఉన్న ఒక దర్శకుడు…. ఈ రోజు అగ్ర హాస్యనటులు అనే ప్రతి ఒక్కరి జీవితం…ఆయన పెట్టిన భిక్ష….మరి ఈ రోజు ఆయన వర్ధంతి, జయంతి లాంటివి జరిగినప్పుడు ఆయన తొలి సినిమా hero ప్రదీప్ గారు తప్ప…ఆయన్ని స్మరించుకునే నాధుడు లేడు…. ఎందుకు ???

మరో రెండు ఉదాహరణలు చెప్పి …point లోకి వెళ్తాను….

దాసరి నారాయణరావు గారు సాధించిన achievements గురించి నాకు ఎలాంటి idea లేదు…నాకు cinema పిచ్చి మొదలయ్యే నాటికి….ఆయన సినిమాలకి ఎటువంటి demand లేదు…. కానీ industry కి వచ్చాక ఆయన ఒంటిచేత్తో సమస్యలని పరిష్కరించటం చూసి ఆయన అంటే ఇష్టం ఏర్పడింది…. సంపూర్ణేష్ లాంటి ఒక hero ని తయారు చేశావ్ అని కొబ్బరిమట్ట ముహూర్తం వచ్చి క్లాప్ కొట్టారు…

ఆయన చనిపోయిన రోజున…industry మొత్తం ఆయన ఇంటికి వచ్చి చూసి వెళ్లారు….కానీ ఆయన ఎస్టేట్ లో దహన సంస్కారాలు జరుగుతుంటే….ఆయన శిష్యులు తప్ప …యువ heroలు, యువ దర్శకులు రావటం నేను చూడలేదు…ఆఖరికి TOP10 దర్శకుల్లో ఒక్కరూ ఆయన దహనసంస్కారం attend అయిన వారు ఎవరో కూడా గుర్తు రావట్లేదు…

కానీ రామానాయుడు గారి దహణ సంస్కారాలకి అందరూ attend అయ్యారు…ఎందుకంటే ఎవరొచ్చారో చూడటానికి ఆయన వారసులు industry లో పెద్ద పొజిషన్లో వున్నారు….

మనుషుల్లో ఈ తరహా behaviour సర్వసాధారణమే అయినా…..cinema వాళ్ళకి మరింత ఎక్కువ అవలక్షణాలు…..ఇక్కడ కృతజ్ఞత అనేది చాలా తక్కువ….ఎందుకంటే ఒకరిని మించిన మరొక ఉద్ధండులు ..నీకు అడుగడుక్కి పరిచయం అవుతూ వుంటారు….కాబట్టి వారికి నీతో అవసరం లేదు…నువ్వు కాకపోతే ఇంకొకరు…

నాకు ఇతని వల్లే అవకాశం వచ్చిందనో, ఇతని వల్లే నేనీ స్థాయిలో వున్నాననో ఎవరికి పెద్ద కృతజ్ఞతా భావం ఉండదు…..

నా వరకే చూసుకుందాం….హృదయకాలేయం తర్వాత నేను చాలా ఆటుపోట్లు చూసాను….ఆ cinema తో లాభ పడ్డ చాలా మంది వ్యక్తులో….ఒక్క సంపూర్ణేష్ బాబు తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు తప్ప ఇంకెవరు నిలబడలేదు…. ఇప్పుడు వారి కారణాలు వారు చెప్పేస్తారు ☺ రేపు మరో విజయం రాగానే తిరిగి వచ్చేస్తారు.. విజయం రాకపోతే మాకు ముందే తెలుసంటారు….నేను మాత్రం నాకు బాట వేసిన వారి పట్ల కృతజ్ఞతగా ఉన్నానా ఏంటి ,☺

ఉదయ్ కిరణ్ death తర్వాత ….ఆయన మీద జాలి చూపించిన వారెవరు..ఆయన బ్రతికి వున్నప్పుడు…ఆయన తో cinemalu తియ్యలేదు…ప్రేక్షకులు tickets కొనలేదు…

వారసుడు గొప్ప స్థాయిలో ఉంటే….చావు తర్వాత కూడ గొప్పగా బతకొచ్చు…. లేకపోతే..పట్టించుకునే నాధుడు లేడు….. నాగ అశ్విన్ లేకుండా సావిత్రి గారి కి ఈ ప్రతిష్ట ఒక generation తో అంతం అయిపోయేది….నిజంగా దర్శకుడు అభినందనీయుడు…

విజయాన్ని ఎప్పుడు తలకి ఎక్కించుకోకండి….. అపజయం శాశ్వతం కాదు…. cinema మీద ప్రేమతో వచ్చావు….సినిమా కోసమే బతుకు….నీ చుట్టూ ఈ రోజు ఉన్న భజన బృందం…మరో సంవత్సరానికి వేరొక దగ్గర చిడతాలు వాయిస్తూ వుంటారు….

నిన్ను అభిమానించే మనిషి….నెల్లూరు లో ఒక గ్రామంలో….రాజమండ్రి లాంటి పట్టణంలో….ఎక్కడో ఒక దగ్గర తమ మనసులో…కొన్ని దశాబ్దాలు దాటినా…. నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు

నువ్వు పోవచ్చు…. నీ సినిమా మాత్రం ఈ భూమ్మీద శాశ్వతంగా నిలిచిపోతుంది…..అలాంటి cinemaకి మాత్రం మనసా వాచా కర్మణా …. నీలోని best ఇవ్వు….అదే శాశ్వతం….అదే జీవితం…

నీతి : రాజు గారి కుక్క చచ్చిపోతే …అందరూ వస్తారు…రాజు గారే పోతే…..ఎవరూ రారు….

Credits : Sai Rajesh

ROBO 2.0__
Movie News
40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్! రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన …

mahesh-25th-look
Movie News
మహేష్ 25 వ మూవీ ఆన్ సెట్ పిక్ leak..

మహేష్ 25 వ మూవీ ఆన్ సెట్ పిక్ leak.. చిత్ర పరిశ్రమ లో leak వ్యవహారం అనేది సర్వసాధారణం..విడుదల కు ముందే సినిమాలోని హైలైట్ సన్నివేశాలు బయటకు leak అవడం , లేదా video songs బయటకు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. కొన్ని కొన్ని సార్లు రేపు సినిమా విడుదల అవుతుందనే సమయంలో ఈరోజు సినిమా మొత్తం internet లో ప్రతేక్ష్యం అయినా ఘటనలు కూడా జరిగాయి. …

dhee 10 ntr__
Movie News
Dhee 10 Final event guest గా ఎన్టీఆర్

Tags : genuine beauty tips, home remedies, natural tips, tollywood gossips, Dhee 10 Grand Finalle, Dhee 10 Grand Finalle Chief Guest, Dhee 10 Grand Finalle Chief Guest Jr Ntr|, Ntr Grand Entry In Dhee, Ntr Grand Entry In Dhee 10 Dance Show, tollywood gossips latest 2018, dhee 10 final episode …