40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

ROBO 2.0__
Movie News

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

శంకర్ ఈ చిత్ర post ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన stunts కోసం 40 kg ల కాస్ట్యూమ్స్ ధరించారట. ఈ news అందరికి shock కి గురిచేస్తోంది. బక్క పలచగా ఉండే రజని ఈ వయసులో కూడా అంత బరువైన costumes ధరించి stunts లో పాల్గొనడం అద్భుతం అని అంటున్నారు.

ఆ బరువైన costumes ధరించి రజినీకాంత్ చేసే విన్యాసాలు సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రజని చాలా enjoy చేశారని చిత్ర యూనిట్ చెబుతోంది. దాదాపు 400 కోట్ల భారీ budget లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.