లాజికల్‌గా ఒక్కమాటే.. సివిల్స్ టాపర్ నా గురించి ఏం చెప్పాడో చూడండి: వర్మ (వీడియో)

Movie News

హైదరాబాద్: సివిల్స్ పరీక్షల్లో 624వ rank సాధించిన యెడవల్లి అక్షయ్ కుమార్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్మ లేకుంటే తనకు life లేదని ఓ interview లో చెప్పారు. వర్మ ఆలోచన చాలా భిన్నంగా,logical గా ఉంటుందన్నారు.

RGV
RGV

ఇందుకు సంబంధించిన video ను వర్మ ట్విట్టర్లో post చేశారు. ఫెయిల్ అయిన సివిల్ ఇంజనీర్ వర్మను సివిల్ topper అక్షయ్ కుమార్ స్ఫూర్తిగా తీసుకున్నారని, అక్షయ్‌ను నేను కలవాలనుకుంటున్నానని, ఆయనతో చదువు గురించి మాట్లాడాలనుకుంటున్నానని వర్మ సామాజిక అనుసంధాన వేదిక twitter లో పేర్కొన్నారు.

సివిల్స్ వైపు రావడానికి స్ఫూర్తి ఎవరని ప్రశ్నించగా..

సివిల్స్ వైపు రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు అని ఇంటర్వ్యూలో anchor ప్రశ్నించగా అక్షయ్ ఈ విధంగా స్పందించారు. కొంతమంది వ్యక్తులను చూసి తన ఆలోచనలు మారాయని, ఇప్పుడు తనకు కోపం రాదని, మన ఆలోచనలు స్వేచ్ఛగా ఉండాలని, తానెప్పుడూ ఎవరి అభిప్రాయం వారిది అనుకుంటానని, ఇదే సూత్రం సివిల్స్ syllabus చదవడాన్ని తనకు సులభతరం చేసిందని అక్షయ్ చెప్పారు.

వర్మను ఎంతగా ఫాలో అయ్యేవాడిని అంటే

తన ఆలోచనలు ఇలా ఉండటానికి ఓ వ్యక్తి కారణమని, అతనే ప్రముఖ వ్యక్తి RGV అని అక్షయ్ వెల్లడించారు. తాను ఆయనను నిత్యం follow అయ్యేవాడినని, ఎంత ఫాలో అయ్యేవాడినో మాటలలో చెప్పలేనని, ఇప్పటికీ రేపు నా పరీక్ష ఉన్నా ఈ రోజు youtube లో RGV వీడియో వస్తే దానిని చూడకుండా పరీక్ష రాయలేనని వెల్లడించారు.

వర్మ లాజికల్‌గా ఒక్కటే మాట్లాడుతారు

RGV, తన రంగాలా చాలా భిన్నమైనవని అక్షయ్ అన్నారు. కానీ అది ముఖ్యం కాదన్నారు. ఓ topic ను logic గా మాట్లాడటం వర్మ నుంచి నేర్చుకున్నానని, పదిమంది ఒకటి మాట్లాడితే, ఆయన ఒకటి మాట్లాడుతారని, ఆయన ఏం మాట్లాడినా logical గా ఉంటుందని, ఓ కారణం ఉంటుందని, అవకాశం వస్తే RGV ను కలుస్తానని, ఆయన లేకపోతే నా జీవితం లేదని, RGV అంతలా తనను ప్రభావితం చేశారని, నా స్నేహితులు కూడా RGV అంటే ఇష్టపడేలా చేశానని నవ్వుతూ చెప్పారు.

ఈ వీడియో చూసి పాఠం నేర్చుకోవాలని వర్మ

అక్షయ్ వీడియోను twitter లో పోస్టు చేసి video లో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చూడాలో కూడా సూచించారు. నేరస్తులను ప్రభావితం చేసే వ్యక్తిగా తనను అందరూ చూస్తారని, ఈ సివిల్ టాపర్‌ను చూసిన తర్వాతనైనా పాఠం నేర్చుకుంటారని అనుకుంటున్నానని RGV  ట్వీట్ చేశారు. ఆకతాయిగా తిరుగుతూ సివిల్ ఇంజినీరింగులో రెండుసార్లు fail అయిన తనకు ఈ విషయం గర్వంగా ఉందన్నారు.

ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE  చేయండి.

=>>కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా…అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే!!
No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rx100-theatrical-trailer-watch-now
Movie News
RX 100 ట్రయిలర్ : అర్జున్ రెడ్డి ని తలదన్నేలా లిప్ లాక్ లు , రొమాన్స్ (వీడియో)

Telugu సినిమాల్లో lip lock లు అంటే చాలా మాములుగా అయిపోయాయి ఇప్పుడు. అదీ ఏమాయ చేసావే , అర్జున్ రెడ్డి ల తర్వాత అయితే మరీ సాధారణంగా మారిపోయాయి. కానీ ఈ trailer లో మాత్రం శృంగారాన్ని మరింత ఘాడంగా , కొంచెం పచ్చిగా చూపించే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఇంకెందుకు ఆలశ్యం క్రింద video ఉంది చూసెయ్యండి.

director-confirmed-for-ntr-biopic-balakrishna
Movie News
ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్!

శ్రీ నందమూరి తారక రామారావు biopic ను ఆయన తనయుడు బాలకృష్ణ అట్టహాసంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ముహుర్తపు shot opening జరిగింది. ఈ సినిమా దర్శకుడు తేజ project నుండి బయటకు రావడంతో ప్రస్తుతం NTR బయోపిక్ పై ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. తేజని మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో కొత్త దర్శకుడి వేటలో పడ్డాడు బాలకృష్ణ. …