Pawan kalyan will be the kingmaker-2019

pawan kalyan
తెలుగు వెర్షన్

‘దటీజ్ Pawan Kalyan ! 2019లో king maker, అభిమానులతోనే ప్రమాదం!!’

హైదరాబాద్: జనసేన అధినేత Pawan Kalyan పైన ఓ మేగజైన్‌లో ‘పవర్ హెఫ్ట్’ పేరుతో ఓ కథనం వస్తోంది. దీనిని జనసేన పార్టీ తెలుగులోకి తర్జుమా చేసి సామాజిక అనుసంధాన వేదిక twitter లో పోస్ట్ చేసింది. Pawan కు ఉన్న భారీ fans ఫాలోయింగ్, లెఫ్ట్ పార్టీ మద్దతుతో ఆయన గెలుస్తారని పేర్కొంది.

ఇందులో పేర్కొన్న దాని ప్రకారం.. ‘ హిట్టు ప్లాపులు మాత్రమే ఒక స్టార్‌కు నిర్వచనంగా నిలిచే సినిమా పరిశ్రమలో Pawan Kalyan వాటికి అతీతమైన వ్యక్తి. ఓ దశాబ్దం పాటు flops వచ్చినా జనాధరణ మాత్రం ఏ కొంచెం పలుచబడలేదు. తెలుగు సినిమా రంగంలో power star తన అభిమానులకు ప్రపంచంలో దైవ సమానుడిగా నిలిచారు. ఆ అభిమానుల్లో పరిశ్రమలోని నటులు కూడా అనేకమంది ఉంటారు.

Pawan ఎలాంటివాడో తెలుసు కాబట్టి అభిమానిస్తారు

సినిమాలలో కంటే నిజ జీవితంలో pawan ఎలాంటి వాడో తెలుసు కనుకనే ఆయనను అమితంగా ప్రేమిస్తుంటామని అభిమానులు చెబుతుంటారు. ఆయన ఆలోచనలు, ప్రవృత్తి, చర్యల ఆధారంగా ఏర్పరుచుకున్న భావజాలం pawanism కు ఆయన అనుచరులు నిబద్దులై ఉంటారు. కానీ సినిమా వేడుకలకు కూడా ఇష్టపడని, మొహమాటపడే నటుడి నుంచి అనేక మంది దృష్టిని ఆకర్షించగల రాజకీయ వక్తగా పరివర్తన చెందడం వరకు pawan కృషి చాలా ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన ఏపీలో TDP, BJP లకు అనుకూలంగా ప్రచారం చేశారని, భారీ జనస్పందన లభించిందన్నారు.

అభిమానులతోనే ప్రమాదం

1996లో అక్కడ అబ్బాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంతో Pawan తన సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత కాలంలో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం, సంప్రదాయానికి భిన్నమైన ప్రతిభతో ఆయన ప్రత్యేకంగా నిలిచారు. సామాజిక సందేశంతో కూడిన చిత్రాలను చేయడం ద్వారా ఆయన ప్రేక్షకుల ప్రేమాభిమానాలను కూడా పొందగలికారు. Fans లో ఆయనకు పెద్దబలం అయిన ఆయనకు వారితోనే ప్రమాదం కూడా ఉండగలదు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఆయన నిరసన తెలియజేస్తున్నప్పుడు ఓ news channel కు చెందిన వాహనంపై రాళ్లు రువ్వి నష్టపరిచినందుకు ఐదుగురు అభిమానులను అరెస్టు చేశారు. గతంలో కూడా ఆయనను విమర్శిస్తున్న వారిపై మాటలతోను, చేతలతోను దాడి చేయడం ద్వారా తమ hero పట్ల ఉన్న అభిమానాన్ని మరో రకంగా చాటుకున్నారు.

అభిమానుల మీదే ఆధారపడి విజయం సాధిస్తారా అంటే?

ఏది ఏమైనా pawan నిశ్చలంగా ఉంటూ అలాంటి ఘటనలను దారి తప్పినవిగా చూడటానికి అలవాటుపడ్డాడు. చాలామంది fans ఇప్పటికే రాజకీయ శక్తిగా రూపుదిద్దుకున్నారని చెప్పారు. వారు కేవలం fans కాదు. సామాజిక సేవతో కూడా అనుబంధం కలిగి ఉన్న వారు అని చెప్పారు. అయితే ఆయన కేవలం తన అభిమానుల మీద ఆధారపడి, తన పార్టీ నిర్మాణం సాగించి, ఎన్నికల్లో విజయం సాధించగలరా? ‘ఎవరైనా సరే నాకు తొమ్మిదేళ్ల రాజకీయ అనుభవం ఉన్నదనే సంగతిని గుర్తించాలి. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యులలో నేను ఒకడిని, 2009లో తొమ్మిది నెలల్లోనే మేం 294 సీట్లలో 280 చోట్ల పోటీ చేయగలిగాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 19 శాతం ఓట్లను మేం పొందగలిగాం. మాకు తగిన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయనడానికి అదే నిదర్శనం’ అని పవన్ అంటారు.

అధ్యయనం ఇలా

విపరీతంగా పుస్తకాలు చదవడమే ఆయనను తీర్చిదిద్దిందని అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతానికి ఆయన శాసన సభా చర్చల మొదటి సంపుటాన్ని చదివే పనిలో నిమగ్నమై ఉన్నారు. నేనింకా 4 సంపుటాలను పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. కానీ ఆయన ఆలోచనలను ఉద్దీపనం చేసి, ఆయనను సమూలంగా మార్చివేసిన ఒక book ఏమిటంటే విక్టర్ ఇ ప్రాంకిల్ రాసిన్ mans search for meaning అనేది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అద్ విజ్ కాన్సంట్రేషన్ క్యాంపులో రచయిత అనుభవాలను ఆ పుస్తకం తెలియజెబుతుంది. fiction కంటే కూడా నిజ జీవిత సంఘటనలతో కూడినవి, వాస్తవ కథనాలు తనకు నచ్చుతాయని pawan అంటారు.

జనసేన king maker రాజకీయ పరిశీలకులు మాత్రం TDP పై పదేపదే దాడికి పూనుకోవడం అనేది PAWAN కళ్యాణ్ చేస్తున్న తెలివైన పనిగా అభివర్ణిస్తున్నారని, రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలను పసిగట్టే ఇలా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారని పేర్కొంది. 2019లో ఏ పార్టీకి మెజార్టీ రాదని PAWAN అన్నారని, 175 అసెంబ్లీ స్థానాలలో ఆయన PARTY చాలా సీట్లలో గెలుపోటమనులను ప్రభావితం చేయగల పాత్ర పోషించబోతోందని, ప్రత్యేకించి కాపులు మెజార్టీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఓ వైపు YCP, టీడీపీ, కాంగ్రెస్, BJPలు ఒంటరిగా తలపడుతున్న సమయంలో CPM, సీపీఐలతో కలిసి పవన్ బరిలోకి దిగుతుందని, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతుందనే అంచనాలు ఉన్నాయని పేర్కొంది. జనసేన కింగ్ మేకర్ కావొచ్చునని పేర్కొంది.

 

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …