నేల టికెట్ సినిమా రివ్యూ

నేల టికెట్ సినిమా రివ్యూ
Movie News

 

మాస్ మహారాజ రవితేజ, Director కల్యాణ్ కృష్ణ కురసాల ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రాజా ది గ్రేట్‌తో Bumper హిట్‌ను సొంతం చేసుకొన్న రవితేజ.. ఆ తర్వాత టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే కల్యాణ్ కృష్ణ మాత్రం 2 బ్లాక్‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకొని Hatrick విజయం కోసం రామ్ తాళ్లూరి నిర్మాతగా నేల టికెట్‌ను రూపొందించారు. రవితేజతో కొత్త భామ మాళవిక శర్మ జతకట్టింది. Teaser, ట్రైలర్లు, first look లు భారీగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో మే 25న నేల టికెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో కల్యాణ్ కృష్ణ hatrick కొట్టాడా? రవితేజ ఖాతాలో మరో విజయం చేరిందా? అనే తెలుసుకోవాలంటే అసలు కథ, కథనాలు, నటీనటుల performance ఏంటో తెలుసుకోవాల్సిందే.

నేల టికెట్ కథ ఇదే
నేల టికెట్ రవితేజ ఓ అనాధ. సేవా గుణం కలిగిన రాజకీయ వేత్త ఆనంద భూపతి (శరత్ బాబు) చేరదీసి ఆదరిస్తాడు. ఆనంద భూపతిని స్వయంగా తన son మినిస్టర్ (అజయ్ భూపతి) హత్య చేస్తాడు. ఆ విషయాన్ని జర్నలిస్టు (కౌముదీ) camera లో రికార్డు అవుతుంది. ఆ విషయం తెలుసుకొన్న అజయ్ భూపతి జర్నలిస్టుపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో అజయ్ భూపతి ఆగడాలను ఎదుర్కొంటూ, అతడు వేసే ఎత్తులకు పైఎత్తు వేస్తుంటాడు.

కథలో ట్విస్టులకు
అజయ్ భూపతిని అక్రమాలను ఎలా ఎదుర్కొన్నాడు? రవితేజ అనుకొన్న లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు? జర్నలిస్టుతో నేలటికెట్టుకు ఉన్న సంబంధం మేమిటి? ఆనంద భూపతిని అజయ్ భూపతి ఎందుకు చంపాడు? ఈ story లో డాక్టర్(మాళవిక శర్మ)తో నేలటికెట్టు సాగించిన ప్రేమయాణం కథకు ఎలా ఉపయోగపడింది అనే questions కు సమాధానమే నేల టికెట్టు కథ.

ఫస్టాఫ్‌లో
ఆనంద భూపతి హత్యతో అసలు story ప్రారంభమవుతుంది. అజయ్ భూపతి దుష్టబుద్ది, అధికార కాంక్ష, అక్రమాలతో cinema సాదాసీదాగా గడిచిపోతుంది. జర్నలిస్టుపై దాడితో కథ మలుపు తిరుగుంది. జర్నలిస్టును కాపాడేందుకు నేలటికెట్టు చేసే ప్రయత్నాలు కొంత ఆసక్తికరంగా సాగుతాయి. అజయ్ భూపతి, నేలటికెట్టు మధ్య జరిగే ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో తొలిభాగం ముగుస్తుంది.

సెకండాఫ్‌లో
ఇక రెండో భాగంలో అజయ్ భూపతి వేసే ఎత్తులకు నేలటికెట్టు పై ఎత్తులు వేయడం, pre climax లో భావోద్వేగమైన episode ఆకట్టుకునేలా ఉంటుంది. డబ్బులో ఆనందంలో ఉండదు. మన చుట్టు ఉండే జనమే మనకు ఆనందం, సంపద అనే చక్కటి point తో కథ ముగుస్తుంది.

దర్శకుడు కల్యాణ్ కృష్ణ
చుట్టు జనం మధ్యలో మనం అనే point ను దృష్టిలో పెట్టుకొని కల్యాణ్ కృష్ణ చేసిన mass కథా చిత్రం నేలటికెట్టు. చెప్పుకోవడానికి పెద్దగా కథలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. emotional సీన్ల పేర్చుకొంటూ వెళ్లిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. రవితేజ image , బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా కథను అల్లుకొన్నాడు. మాస్ ఎలిమెంట్స్ జొప్పించి హాస్యాన్ని పండించాడు. ఇప్పటి వరకు క్లాసిక్ చిత్రాలను రూపొందించిన కల్యాణ్ కృష్ణ మాస్ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించుకొన్నారు.

మాస్ మహారాజా రవితేజ ఫెర్ఫార్మెన్స్
నేలటికెట్టు లాంటి పాత్రలు రవితేజకు కొట్టిన పిండి. హాస్యం, action మేలవించి ఇలాంటి పాత్రలు ఎన్నో చేశారు. కానీ నేల టికెట్టు పాత్ర రవితేజకు కొత్తదనం లేని routine పాత్ర. అయినా తనదైన మార్కులో emotions పలికించాడు. ఆనాధలు, వృద్ధుల episodes లో రవితేజ విజృంభించాడు. ముఖ్యంగా climax లో రవితేజ చెప్పిన అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

మాళవిక శర్మ గ్లామర్
తెలుగు తెరకు తొలిసారి పరిచయమైన మాళవిక శర్మ Doctor పాత్రలో కనిపించింది. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర. ఆట, పాటలకు, అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమైంది. నటన పరంగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. నేల టికెట్టు song లో మాళవిక ఆకట్టుకొన్నది.

జగపతిబాబు, సంపత్ రాజ్ నటన
నేల టికెట్టు చిత్రంలో కథ అంతా జగపతిబాబు చుట్టే తిరుగుంది. ప్రాధానంగా villan angle లో నడవడంతో జగపతిబాబు పాత్ర హైలెట్‌గా ఉంటుంది. జగపతి body language , ఎమోషన్స్, విలనిజం కొత్తగా ఉంటాయి. అయితే ఇటీవల పోషించిన పాత్రలకు భిన్నంగా మాత్రం అజయ్ భూపతి పాత్ర ఎక్కడ కనిపించదు. సినిమాలో సంపత్ రాజ్ పాత్ర చాలా low profile లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో సంపత్ రోల్ బౌన్స్ కావడం, కథకు బలం చేకూరే విధంగా ఉంటుంది. ప్రేక్షకులు పెద్దగా గుర్తుంచుకొనే పాత్ర కాదని చెప్పవచ్చు.

ఫైనల్‌గా
మాస్ అంశాలతోపాటు కొన్ని emotional పాయింట్స్ కలబోసిన చిత్రం నేలటికెట్టు. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా సినిమా చూసొద్దామనే ప్రేక్షకులకు, రవితేజ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా పక్కా chioce. ఇక కొత్తదనం ఆశించే వారికి కొంత నిరాశనే మిగులుస్తుంది. weekend సినిమా లవర్స్‌కు టైంపాస్ మూవీ.

Rating: 2.75/5

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …