Naa peru surya movie review rating

naa peru surya movie review
తెలుగు వెర్షన్

Title: నా పేరు సూర్య‌

Banner రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, అనూ ఎమ్యాన్యుయేల్‌, శ‌ర‌త్‌కుమార్‌, అర్జున్‌, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు

కెమేరా: రాజీవ్ ర‌వి

Music: విశాల్ శేఖ‌ర్‌

Editing: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీథ‌ర్ – బ‌న్నీ వాస్‌

Director: వ‌క్కంతం వంశీ

సెన్సార్ రిపోర్ట్‌: U/A

సినిమా నిడివి : 167 Min

విడుద‌ల తేదీ: 04 మే, 2018

Mega Family నుంచీ వచ్చిన “స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి తగ్గట్టుగానే మంచి పేరు తెచ్చుకున్నాడు..ఇప్పుడు ప్ర‌స్తుతం Allu Arjun టాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు…Racegurram  సినిమా నుంచీ వచ్చిన దూకుడు కంటిన్యూ అవుతూనే ఉంది…రేసుగుర్రం నుంచి DJ వ‌ర‌కు బ‌న్నీ చేసిన సినిమాలు అన్ని టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్ల

వ‌ర్షం కురిపించేస్తున్నాయి. ..ఇప్పటి వరకూ Allu Arjun తన కెరియర్ లో చేసిన సినిమాలు అన్నీ ఒకెత్తు ఈరోజు రిలీజ్ అయిన నా పేరు సూర్య‌. ఓ కెత్తు..తన కెరియర్లో నే ఈ సినిమా ఒక మెయిలు రాయిగా నిలుస్తుందని భావిస్తున్నాడు బన్నీ.. వ‌క్కంతం వంశీ Direction లో తెరకెక్కిన ఈ సినిమాను k.nagababu సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ Producer, బన్నీ వాసు సహ నిర్మాతగా నిర్మించారు. కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ Hit చిత్రాలకు కథలను అందించి Writerగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ మొదటిసారి ఈ మూవీ తోDirector గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం, అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్‌గా క‌నిపించ‌డంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోను ఉంది…దీనికి తోడు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్ల‌కు అమ్ముడుపోయాయి..మరి ఎన్నో అంచనాలతో విడుదల అయ్యిన సూర్య అభిమానులని అలరించాడా..? సగటు ప్రేక్షకుడి కి నచ్చాడా..? అన్నది Topinonline.com విశ్లేషణం లో చూద్దాం

Story : సూర్య ( అల్లూ అర్జున్) కి ఆవేశం చాలా ఎక్కువ..విపరీతమైన కోపం కలిగిన సుర్యాకి Armyలో కి వెళ్ళాలనే కోరిక ఎంతో బలంగా ఉంటుంది..ఎంతో పట్టుదలతో Army లోకి వెళ్ళిన సూర్య అక్కడ కొన్ని పరిణామాల వలన పనిష్మెంట్ కి గురవుతాడు..అయితే మళ్ళీ Army లో చేరడానికి తండ్రి సంతకం తప్పని సరి కావడంతో సూర్యా తండ్రి సైంటిస్ట్ అయిన Action King Arjun వద్దకి వెళ్తాడు..అయితే అక్కడ తండ్రి సంతకం పెట్టడం కోసం సూర్యా కి కొన్ని కండిషన్స్ పెడుతాడు.. అయితే అక్కడ జరిగే అనూహ్యమైన పరిణామాల నేపధ్యంలో…అన్నిటికీ నెగ్గిన సూర్య ఎంతో ఇష్తమైన Army లోకి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తాడు..అయితే సూర్యని ఎందుకు Army అధికారులు suspend చేస్తారు..? తండ్రి సంతకోసం కోసం వచ్చిన సూర్య కి తన తండ్రి ఏమని conditions పెడుతాడు..? ఎంతో ఇష్టమైన army ని వీడి సూర్య ఎందుకు తండ్రి దగ్గర ఉండిపోవాలని అనుకుంటాడు..? మళ్ళీ ఎలా సూర్యా Army లోకి వెళ్తాడు..? అనేది కధ.

విశ్లేషణ

ఇక విశ్లేషణలో కి వెళ్తే …ఎంతో ఆగ్రహం ఉండే సైనికుడి పాత్రలో Allu Arjun ని ప్రెజంట్ చేశాడు వంశీ…అయితే కధ ముందుకు వెళ్ళే కొద్దీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పాలి….First Half లో కొంత భాగం flash back mode తో సాగుతుంది.. ఇదిలాఉంటే action king arjun బన్నీ తండ్రిగా ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ గా ఎంతో stylish గా ఈ సినిమాలో కలిపిస్తారు….ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని capture చేద్దామని దర్శకుడు భావించినా సరే ఆ మేరకు సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి….అయితే ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి blockbaster సినిమాలకి ఎంతో అద్భుతమైన కధలు అందించిన వంశీ తానూ డైరెక్ట్ చేస్తున్న సినిమాకి మాత్రం కధ ని సరిగా రాసుకోలేడనే చెప్పాలి..

ఎంతో emotions తో కూడుకున్న కధ కాబట్టి కనీసం ఎమోషన్స్ అయినా క్యారీ చేసేలా ఉంటే బాగుండేది..బన్నీ సినిమాలో ఎప్పటిలాగానే action సీన్స్ బాగుంటాయి ఈ సినిమాలో సైతం action సీన్స్ కి మంచి మార్కులు ఇవ్వవచ్చు..అయితే కొన్ని కారణాల వలన army లో punishmnt ఇచ్చిన తరువాతి నుంచీ కధ వేరే track ఎక్కుతుంది… ఫ్యామిలీ లవ్ సీన్స్ అన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చెసినా ఆ సీన్స్ ఆకట్టుకొని విధంగా ఉన్నాయి..కొన్ని కొన్ని చోట్ల కధ చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది..కొన్ని సందర్భాలలో అయితే తల పట్టుకోవాల్సిందే.

ఇక సెకండ్ హాఫ్ సినిమా బాగుంది అనిపిస్తుంది.. అందులో బన్నీ cap ట్రిక్స్ మెప్పిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు మినహాయించి ఇతర సన్నివేశాలు కొంచెం routineగా అనిపించినా సరే ప్రేక్షకులని మెప్పించారనే చెప్పాలి..ఈ సీన్ బాగుంది అనుకున్న సమయనానికి మరో సీన్ లో ప్రేక్షకుడు dull అయిపోతాడు..స్టైలిష్ స్టార్ బన్నీ నుంచి వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలని అందుకోలేడనే చెప్పాలి.. Majorగా కథ కథనంలో బలం లేకపోవడం వీక్ పాయింట్. ఒక కథ రచయిత అయిన వక్కంతం వంశీ ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నాడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది..

ప్లస్ పాయింట్స్ (+)

– అల్లూ అర్జున్ నటన

– బ్యాగ్రౌండ్ మ్యూజిక్

– యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ (-)

– స్క్రీన్ ప్లే

– పాటలు

– డైరెక్షన్

– కామెడీ

 

PunchLine – స్టైల్స్ స్టార్ బన్నీ…army ఆఫీసర్ గా సక్సెస్ కాలేక పోయాడు

రేటింగ్ – 2.5 / 5

 

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …