‘మహానటి’ రివ్యూ: జయహో మహానటి

mahanati-telugu-movie-review-and-ratings
Movie News
వీక్షకుల సరాసరి రేటింగ్ 3.5/5
దర్శకత్వం Biography,Drama
వ్యవధి 2 hours 56 minutes
దర్శకత్వం నాగ్ అశ్విన్
నటీనట వర్గం కీర్తి సురేష్,దుల్కర్ సల్మాన్,సమంత,విజయ్ దేవరకొండ,షాలిని పాండే,నాగ చైతన్య

విమర్శకుల Review

సినీ fans ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన లెజెండరీ actor సావిత్రి biopic మూవీ ‘మహానటి’ భారీ అంచనాల నడుమ బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు cinema చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి. ఆ జీవితం మొత్తం తెరచిన పుస్తకమే. 75 % నటిగానే సాగింది ఆమె జీవితం. ఆ మిగిలిన
25 % జీవిత పరిణామాలపై రకరకాల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతూ మే 9న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సావిత్రి biopic మూవీ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకూ reach అయ్యిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..
కథ: 
మధురవాణి(సమంత) BA గోల్డ్ మెడలిస్ట్. ప్రజావాణి అనే పత్రికా office లో జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఆమె ప్రతిభను నిరూపించుకునే అవకాశం మాత్రం దొరకదు. అదే సమయంలో నటి సావిత్రి గారు అనారోగ్యంతో hospital లో చేరతారు. ఆమె కోమా స్టేజ్‌లోకి వెళ్లిపోవడంతో ఆమెకు సంబంధించిన వార్తను cover చేయమని ఎడిటర్ మధురవాణికి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ క్రమంలో మధురవాణి.. సావిత్రి గారి జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకుంటుంది. వాటి సహాయంతో సావిత్రి జీవితాన్ని ఓ కథగా రాయలనుకుంటుంది. మధురవాణికి సావిత్రి గారి గురించి ఏం తెలిసింది..? చివరకు తను అనుకున్న కథను రాయగలిగిందా..? అనేదే మిగిలిన cinema.
విశ్లేషణ:

సావిత్రి జీవిత చరిత్రతో ఓ young డైరెక్టర్ cinema చేస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఆమె గురించి ఏం తెలుసని, అతడికి ఏం అర్హత ఉందంటూ కొన్ని comments చేశారు. కానీ ఈ సినిమా వారందరికీ ఓ సమాధానంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలనే screen పై ఎంతో ఆసక్తికరంగా ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు..? అసలు ఆమె సినిమాల్లోకి రావడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి..? సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది..? బంగారం లాంటి తన జీవితాన్ని మద్యానికి ఎందుకు బానిస చేయాల్సి వచ్చింది..? ఇలా ఆమె జీవితంలో చోటు చేసుకున్న మంచి, చెడు రెండు screen పై చూపించారు. కానీ ప్రతీదీ నిజాయితీగా చూపించిన దర్శకుడు Nag అశ్విన్‌ను భుజం తట్టి మెచ్చుకోవాల్సిందే. 
mahanati-telugu-movie-review-and-ratings
mahanati-telugu-movie-review-and-ratings
Cinema చూస్తున్నంత సేపు ప్రేక్షకుడి ముఖంలో ఒకరకమైన సంతృప్తి కలుగుతుంటుంది. ఎందరికో help చేసిన మహానటి చివరి రోజుల్లో పడే బాధను చూసి ప్రేక్షకుడు చలించిపోతాడు. ప్రేమించిన వ్యక్తిని తన love కోసమే దూరం చేసుకునే విషయంలో ఆమె వ్యక్తిత్వం ఎంత బలమైనదో అర్ధమవుతుంది. ‘ఇది నీ వల్ల కాదు’ అని ఎవరైనా ఆమెను comment చేస్తే మొండి పట్టుదలతో తన వల్ల కాదన్న విషయాన్ని చేసి చూపిస్తుంది. ఇదీ సావిత్రి నైజం. బహుశా ఇకపై ఆమెలాంటి మహానటిని చూడలేమేమో అనిపిస్తుంటుంది. అంత గొప్ప నటి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటనను ప్రదర్శించారు. కొన్ని చోట్ల సావిత్రి గారిని నిజంగానే మళ్ళీ తెరపై చూస్తున్నామా..? అనేంతగా ఆ పాత్రలో ఇమిడిపోయింది. కాస్ట్యూమ్స్, make up విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో మాయాబజార్ episode, అలానే సావిత్రి గారి పరిచయ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. కీర్తి తప్ప ఈ పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరేమో.. అంతగా ప్రేక్షకులపై impact చూపించింది. బాధ, సంతోషం, కోపం, పట్టుదల ఇలా ప్రతి ఒక్క ఎమోషన్‌ను కళ్ళతోనే పలికించింది. 
 …
మహానటికి తన నటనతో పూర్తి న్యాయం చేసింది. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఇమిడిపోయాడు. కీర్తి, దుల్కర్ ల combination సన్నివేశాలు బాగా పండాయి. సావిత్రి గారు తన భార్య అంటూ జెమినీ గణేషన్ అందరి ముందు చెప్పే సన్నివేశం వారి మధ్య ఎంత ప్రేమ ఉందో.. తెలిసేలా చేస్తుంది. ఇక ANR పాత్రలో నాగ చైతన్య జీవించారు. రెండు మూడు సీన్లలో ANR ను గుర్తుచేశారు. మరో కీలకమైన ROLE ఎన్టీఆర్ పాత్రలో ఆ మహానటుడ్నే చూపించారు. కొత్తగా ఆ పాత్రకోసం ఎవర్నీతీసుకునే ప్రయత్నం చేయలేదు. మధురవాణిగా సమంత, విజయ్ ఆంటోనీగా విజయ్ దేవరకొండ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. sv రంగారావు పాత్రలో మోహన్ బాబు నటన మరో అద్భుతం. సావిత్రి గారి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్ పాత్ర తెరపై బాగా పండింది. కీర్తి, రాజేంద్రప్రసాద్‌ల ట్రాక్ సినిమాకు మరో ప్లస్. 
 …
షాలిని పాండే, క్రిష్, అవసరాల శ్రీనివాస్, ప్రకాష్ రాజ్ ఇలా ప్రతి ఒక్క నటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమాను మంచి Quality తో తెరకెక్కించారు. కెమెరా work సినిమాకు హైలైట్‌గా నిలిచింది. కొన్ని సన్నివేశాల కోసం పాతకాలపు film ను ఉపయోగించారు. బ్లాక్ అండ్ వైట్ సన్నివేశాలను చూడడం కొత్తగా అనిపిస్తుంది. Art వర్క్ అద్భుతంగా ఉంది. మిక్కీ j మేయర్ అందించిన పాటలు సినిమా స్థాయిని పెంచాయి.టైటిల్ సాంగ్, చివరకు మిగిలేది వంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
 

నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. Editing వర్క్ బాగుంది. ప్రేక్షకుడు సినిమాలో involve అవ్వడంతో నిడివి గురించి పెద్దగా పట్టించుకోరు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులకు మహానటి ఎంత గొప్పదో చాటిచెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ను పొగడకుండా ఉండలేము. ఓవరాల్‌గా మహానటి ఓ అద్భుత దృశ్య కావ్యం. తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వించే సావిత్రి కథే ‘మహానటి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. .

రేటింగ్: 3.5/5 

ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి.
==>>దేవరకొండ బర్త్ డే ట్రక్స్ : ఐస్ క్రీమ్స్ free గా తినేయండి


No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ROBO 2.0__
Movie News
40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్! రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన …

mahesh-25th-look
Movie News
మహేష్ 25 వ మూవీ ఆన్ సెట్ పిక్ leak..

మహేష్ 25 వ మూవీ ఆన్ సెట్ పిక్ leak.. చిత్ర పరిశ్రమ లో leak వ్యవహారం అనేది సర్వసాధారణం..విడుదల కు ముందే సినిమాలోని హైలైట్ సన్నివేశాలు బయటకు leak అవడం , లేదా video songs బయటకు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. కొన్ని కొన్ని సార్లు రేపు సినిమా విడుదల అవుతుందనే సమయంలో ఈరోజు సినిమా మొత్తం internet లో ప్రతేక్ష్యం అయినా ఘటనలు కూడా జరిగాయి. …

dhee 10 ntr__
Movie News
Dhee 10 Final event guest గా ఎన్టీఆర్

Tags : genuine beauty tips, home remedies, natural tips, tollywood gossips, Dhee 10 Grand Finalle, Dhee 10 Grand Finalle Chief Guest, Dhee 10 Grand Finalle Chief Guest Jr Ntr|, Ntr Grand Entry In Dhee, Ntr Grand Entry In Dhee 10 Dance Show, tollywood gossips latest 2018, dhee 10 final episode …