Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data
- By : Topinonline
- Category : Offers, Tech News
- Tags: jio daily 4.5gb data

Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data
టెలికాం రంగంలో Idea-Vodafone కంపెనీలు ఒక్కటి కాబోతున్న సమయంలో.. టెలికాం రంగంలో idea అతి పెద్ద కంపెనీగా అవతరించనున్న క్రమంలో.. ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. Idea-Vodafone విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే.. Jio అతిపెద్ద ఆఫర్ ప్రకటించి ఔరా అనిపించింది.
ప్రస్తుతం Jio రూ.299 ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీలో ప్రతి రోజూ 3GB data ఇస్తోంది. కస్టమర్లు అడక్కుండానే.. Free ఆఫర్ ప్రకటించింది. ప్రతి రోజు అదనంగా 1.5 GB డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది.
అంటే నెలకు రూ.299 ప్యాక్ తీసుకుంటే.. 28 రోజులపాటు ప్రతిరోజు 4.5 GB డేటా లభించనుంది.
అంటే మొత్తంగా 126 GB data పొందనున్నారు కస్టమర్లు. ప్రతి మరి ఏ ఇతర కంపెనీ network లోనూ ఈ ప్యాక్ రేటులో.. ఇంత data ఇస్తున్న దాఖలాలు లేవు. Data ఎక్కువ ఉపయోగించుకునే వారికి Jio లో ఇది best ప్యాక్ అంటోంది మార్కెట్.
దీంతోపాటు మరికొన్ని offers కూడా ఇచ్చింది Jio. రూ.149, రూ.349, రూ.499 ప్యాక్ లపైనా ప్రతి రోజూ 3GB డేటా అందిస్తోంది.
అంతేకాకుండా MyJioయాప్ ద్వారా రూ.300పైన రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు రూ.100 డిస్కొంట్ ఇస్తోంది. అంత కంటే తక్కువగా recharge చేసుకునే వారికి కూడా 20శాతం discount ఇస్తూ.. అందరికీ అన్ని ప్యాక్స్ పై ఆఫర్స్, డిస్కొంట్ ఇచ్చింది jio నెట్ వర్క్.