మీరు పంపే Whatsapp ఫోటోల్లో క్వాలిటీ తగ్గుతోందా..?

how-to-send-pictures-without-compression-on-whatsapp-telugu
Tech News

 

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న whatsapp నిత్యం కొత్త ఫీచర్లతో మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా నిత్యం లక్షలాది ఫోటోలు share కాబడుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా send చేయబడుతోన్న ఫోటోలు అవతలి వ్యక్తికి చేరుకునే సమయానికి compression కు గురవుతున్నాయి. దీంతో image క్వాలిటీ దాదాపుగా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఫుల్ రిసల్యూషన్‌తో కూడిన ఫోటోలను whatsapp లో యూజర్లు share చేసుకోలేకపోతున్నారు.

File browser ద్వారా attach చేస్తే..

ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను fallow అయి నాన్-కంప్రెసుడ్ ఫోటోలను whatsapp ద్వారా షేర్ చేసుకోండి. మనలో చాలా మంది వాట్సాప్‌లో ఏదైనా image ను అప్‌లోడ్ చేయాలనుకున్నపుడు ముందుగా ఆ file ను ఫైల్ బ్రౌజర్ ద్వారా అటాచ్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్లే ఇమేజ్ క్వాలిటీ అనేది సగానికి తగ్గిపోతుంది.

బ్రౌజ్ అదర్ డాక్స్…

ఇక పై అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా PHOTO ను పంపాలనుకన్నపుడు ముందుగా అటాచ్ లింక్ పై click చేసి డాక్యుమంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ icon ను సెలక్ట్ చేసుకున్న తరువాత Browse other Docs.. పేరుతో ఆప్షన్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై click చేసినట్లయితే మరో screenకు మీరు రీచ్ అవుతారు. ఇక్కడ మీరు పంపాలనుకుంటోన్న ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని share చేసినట్లయితే ఆ ఫోటో ఏ మాత్రం కంప్రెస్ కాకుండా అవతలి వ్యక్తికి షేర్ కాబడుతుంది.

YOWhatsApp యాప్ ద్వారా..

మరొక పద్థతిలో భాగంగా YOWhatsApp అనే థర్డ్ పార్టీ App ను ఉపయోగించుకుని అన్-కంప్రెసుడ్ ఫోటోలను whatsapp ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా ఈ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి YoWhatsApp అప్లికేషన్‌ను install చేసుకోవల్సి ఉంటుంది. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌తో app ను కన్ఫర్మ్ చేసుకుని లాంచింగ్ ప్రక్రియను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఈ పక్రియ పూర్తి అయిన తరువాత నుంచి photo ను ఏ మాత్రం రిజల్యూషన్ దెబ్బతినుకుండా క్వాలిటీ షేర్ చేసుకోవచ్చు.

మీ whatsapp అకౌంట్‌లోని ఫోటోలు, వీడియోలు ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీలోని photos ఇంకా వీడియోలను ఎవరికి కనిపించకుండా దాచేయలనుకుంటున్నారా..? app lock పేరుతో ఓ అప్లికేషన్ అందుబాటులో ఉన్నప్పటికి ఫోటోలు ఇంకా వీడియోలు గ్యాలరీలో కనిపిస్తూనే ఉంటాయి. Galleryని మొత్తం లాక్ చేసేందుకు గ్యాలరీ లాక్ అందుబాటులో ఉన్నప్పటికి అంతగా శేయస్కరం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి..? మీ whatsapp అకౌంట్ గ్యాలరీని లాక్ చేయటం కన్నా hide చేయటం ద్వారా ఎక్కువ సెక్యూరిటీని పొందవచ్చు. మరో ఆసక్తికర విషయమేమింటే మీ వాట్స్‌వాప్ గ్యాలరీని hide చేసేందుకు ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్ సహకారం అవసరం లేదు.

ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది…

whatsapp డైరక్టరీని మీ ఫోన్ sd కార్డ్‌లోకి యాక్సెస్ చేసుకునేందుకు ఓ ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది. మీ ఫోన్‌లో ఏ విధమైన ఫైల్ మేనేజర్ app ఇన్‌స్టాల్ చేసి లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ES File Exploreను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ES File Explore యాప్‌ను open చేయండి. ఆ తరువాత వాట్సాప్ మీడియా ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media. ఆ తరువాత వాట్సాప్ media ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media.

Photos ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే..

ఇప్పుడు ఆ ఫోల్డర్ పేరను ‘.WhatsApp Images’గా మార్చండి.ESFILE ఎక్స్‌ప్లోరర్‌లో ఎదైనా ఫోల్డర్‌కు Rename చేయాలంటే ఆ ఫోల్డర్ పై లాంగ్ ప్రెస్ చేసినట్లయితే రీనేమ్ ఆప్షన్ స్ర్కీన్ క్రింది భాగంలో ప్రతక్షమవుతుంది. రీనేమ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీరు whatsapp గ్యాలరీలోకి వెళ్లండి. ఏ విధమైన వాట్సాప్ ఫోటోలుగానీ, వీడియోలు గానీ మీకు కనిపించవు. hide కాబడిన ఫోటోలు ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే ‘.WhatsApp Images’ ఫోల్డర్ పేరులోని ( . ) తొలగించినట్లయితే వీడియోలు, ఫోటోలు తిరిగి వాటి స్థానాల్లోకి వచ్చేస్తాయి.

ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి.

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Patas comedy dubsmash musically jabaradasth__
తెలుగు వెర్షన్
Patas Comedy Punches dubsmash Musically || Bindas Brothers Performance || Jabardasth || Viral Babai

  kaushal army, kaushal, ntr, mahesh babu, allu arjun, pawan kalyan, jagan, kcr, chiranjeevi, ram charan, prabash, telugu dubsmash, telugu girls dubsmash, telugu girls, telugu movies, dubsmash, ntr fans, prabhas fans, pawan kalyan fans, cute girls dubsmash, comedy dubsmash, comedy videos, viral videos, mehaboob shaik, build up babai, jabardasth, …

Patas comedy dubsmash musically
తెలుగు వెర్షన్
Patas comedy dubsmash musically || Bindas brothers performance || Jabardasth Dubsmash

kaushal army, kaushal, ntr, mahesh babu, allu arjun, pawan kalyan, jagan, kcr, chiranjeevi, ram charan, prabash, telugu dubsmash, telugu girls dubsmash, telugu girls, telugu movies, dubsmash, ntr fans, prabhas fans, pawan kalyan fans, cute girls dubsmash, comedy dubsmash, comedy videos, viral videos, mehaboob shaik, build up babai, jabardasth, jabardasth …

titli toofan
తెలుగు వెర్షన్
titli cyclone srikakulam, titli toofan